ఢిల్లీలో ఉన్న కేసీఆర్ రైతులకు ఎందుకు సంఘీభావం ప్రకటించలేదు

Monday, December 28th, 2020, 03:45:33 PM IST

తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశారు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్, ఢిల్లీ వెళ్ళాక కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని అంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత్రిత సాగు విషయంలో సీఎం కేసీఆర్ మొదటి నుండి మొండిగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. రైతులకు సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రైతుల విషయం లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరం అని అన్నారు.

అయితే పలు విధాలుగా రైతులు నష్టపోయిన విషయాన్ని ప్రస్తావించిన జగ్గారెడ్డి, ఢిల్లీ లో ఉన్నప్పటికీ చలిలో ఉద్యమాలు చేస్తున్న రైతులకు ఎందుకు సంఘీభావం ప్రకటించలేదు అంటూ ప్రశ్నించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి అని అంటున్న కేసీఆర్ అమిత్ షా ను ఎందుకు కలిశారు అంటూ వరుస ప్రశ్నలు గుప్పించారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లో మూడు రోజులు ఉండి వచ్చి, 13 రోజుల పాటు ఫాం హౌస్ లో గడిపి, కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం అనడానికి కారణం ఏమిటో రైతులు ఆలోచించుకోవాలి అంటూ సూచించారు. అయితే బీజేపీ మరియు తెరాస లు రైతులకు తీవ్రంగా నష్టం చేస్తున్నాయి అని అన్నారు. అయితే రైతుల పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని అన్నారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారాయి.