గ్రేటర్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి బిగ్ షాక్.. కీలక నేత బీజేపీలోకి..!

Saturday, November 21st, 2020, 01:10:23 AM IST

వరుస ఓటములు, పార్టీ ఫిరాయింపులతో చతికల పడ్డ తెలంగాణ కాంగ్రెస్‌కి గ్రేటర్ ఎన్నికల ముందు మరో షాక తగలబోతుంది. ఆ పార్టీ కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్య నారాయణ ఇంటికి తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెళ్ళారు. బీజేపీలో చేరాలని సర్వే సత్యనారాయణను బండి సంజయ్ ఆహ్వానించారు. దీంతో వారి అభ్యర్థనను సర్వే సత్యనారాయణ స్వాగతించారు.

అయితే బీజేపీలో చేరమని బండి సంజయ్, వివేక్ కోరారని, ప్రోటోకాల్ ప్రకారం తాను త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు సర్వే సత్యనారాయణ ప్రకటించారు. అంతేకాదు తనతో పాటు చాలా మందిని బీజేపీలో చేర్పిస్తానని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.