కేసీఆర్ సర్కార్‌ని నిలదీసిన సామాన్య యువకుడు.. ఏమన్నాడంటే..!

Thursday, July 16th, 2020, 05:58:13 PM IST

ఓ సామాన్య యువకుడు కేసీఆర్ సర్కార్‌ని నిలదీసిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. తన సోదరుడికి ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని అన్నాడని, కరోన టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చిందని చెప్పాడు.

అయితే అపోలోకి వెళితే వాళ్లు జాయిన్ చేసుకోలేదని తర్వాత గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళితే అక్కడ కూడా చేర్చుకోలేదని, కాంటినెంటల్, సన్‌సైన్, తర్వాత నిజాంపేట, కూకట్‌పల్లిలోని హోలిస్టిక్ ఆస్పత్రి, కేర్ ఆస్పత్రికి వెళితే బయటు నుంచి బయటే పంపారని, విరించి అసుపత్రికి కూడా వెళ్ళామని ఏ ఒక్క ఆసుపత్రి చేర్చుకోలేదని అన్నారు. చివరకు సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఒకే బడ్ ఉందని 5 లక్షలు కడితేనే చేర్చుకుంటామని చెప్పగా, 3 లక్షలు ఇచ్చి పేషంట్‌ను చేర్పించామని అన్నారు.

అయితే దాదాపు హైదరాబాద్‌లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులన్ని తిరిగామని చివరకు గాంధీ ఆసుపత్రి ఒకటే దిక్కు అనిపించిందని కానీ తన సోదరుడు గాంధీకి వెళ్లేబదులు ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంటానని చెప్పాడన్నారు. అయితే చేతిలో డబ్బు పట్టుకుని తిరిగినా ప్రైవేట్ ఆసుపత్రులు చేర్చుకోవడం లేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించాడు.