గాళ్ ఫ్రెండ్ ను చంపి.. బీరువాలో దాచిపెట్టి..?

Sunday, February 7th, 2016, 08:59:05 PM IST

girl
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడ స్థానికంగా నివసించే నవీన్ అనే యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ అయిన 21 ఏళ్ళ ఆర్జూ అనే కాలేజ్ అమ్మాయిని దారుణంగా చంపేసి మృతదేహాన్ని తన ఇంట్లోని బీరువాలో దాచాడని తెలుస్తోంది.

అసలు విషయంలోకి వెళితే, నవీన్, ఆర్జూలు ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇదే సమయంలో నవీన్ మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్దమవడంతో.. ఆ విషయం తెలుసుకున్న ఆర్జూ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో కోపానికి లోనైనా నవీన్ ఆమె అడ్డును ఎలాగైనా తొలగించుకోవాలని భావించి దారుణంగా చంపేసి బీరువాలో దాచేశాడు. ఆ తర్వాత తమ కుమార్తె కనిపించకపోవడంతో ఆర్జూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి నవీన్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నవీన్ ను ఇంటరాగేట్ చేసి అసలు విషయాన్ని బయటపెట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నవీన్ ఇంట్లోని బీరువా నుంచి ఆర్జూ మృతదేహాన్ని బయటకు తీశారని సమాచారం.