జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.. ప్రధాని మోదీకి సీఎం కేసీఅర్ లేఖ..!

Tuesday, September 1st, 2020, 06:07:59 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. జీఎస్టీ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘించిందని, రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారరం తగ్గించాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ చట్టం ప్రకారం 14 శాతం వృద్ధి రేటు ఆధారంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే దానికి కేంద్రమే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు.

అయితే గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు హామీ ఇచ్చి మాట తప్పిందని అందుకే ఎన్డీయే కూడా అలానే చేస్తుందని భావించి జీఎస్టీనీ ప్రశ్నించామని అన్నారు. అయితే ఊహించినట్టుగానే జీఎస్టీ పరిహారం చెల్లింపుల్లో కోత విధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం తప్పక ఇస్తామని చట్టంలో చెప్పి ఇప్పుడు మాట తప్పి ఉల్లంఘనకు పాల్పడుతున్నారని అన్నారు. అయితే కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ బాగా కోల్పోయిందని అందుకే కేంద్రమే రుణం తీసుకుని పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు.