ప్రధాని, రాష్ట్రపతి లకు సీఎం కేసీఆర్ లేఖ

Friday, November 20th, 2020, 12:03:19 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారికి వేర్వేరుగా లేఖ రాశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ బాషల్లో నిర్వహించాలని లేఖ లో సూచించారు. అయితే భారత ప్రభుత్వం అధీనం లో యూపీ ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లు, ఆర్బీఐ, స్టాఫ్ సెలక్షన్ కమిటీ వంటి విభాగాల్లో పరీక్షలు హిందీ మరియు ఇంగ్లీష్ లో నిర్వహిస్తున్నారు అని, దీంతో ఆంగ్ల మాధ్యమం లో చదవని మరియు హిందీ యేతర రాష్ట్రాల అభ్యర్దులు తీవ్రంగా నష్టపోతున్నారు అని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్ళారు. అయితే అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సమాన అవకాశాలు వచ్చే విధంగా ప్రాంతీయ బాషల్లో పరీక్షలు నిర్వహించాలని కోరారు.

అయితే ఇటు రాష్ట్రపతికి రాసిన లేఖ లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు రాష్ట్రంలో నిర్వహిస్తున్నాం అని తెలిపారు. ఆయన జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పీవీ స్మారక తపాలా స్టాంప్ ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది అని, కేంద్రం ప్రణాళిక కి వెంటనే ఆమోద ముద్ర వేయాలని కోరారు. దక్షిణాది విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సమయం లో స్టాంప్ ను ఆవిష్కరించాలి అని తెలిపారు.