వీఆర్ఏ లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

Saturday, September 12th, 2020, 01:04:50 AM IST


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. వీ ఆర్ ఏ లకు తాజాగా ఒక శుభ వార్త అందించారు. ఉద్యోగులకు పే స్కేల్ అమలు తో పాటుగా పదవీ విరమణ కోరితే ఆ కుటుంబం లోని ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం అని సంచలన ప్రకటన చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాలలో వీ ఆర్ ఏ లు చేస్తున్న సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారు ఎంత గానో సేవ చేస్తున్నారు అని, వీరిలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు అంటూ సీఎం కేసీఆర్ కొనియాడారు.

అయితే ఎన్నో ఏళ్లుగా వీళ్ళు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో వారు కోరుకుంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చేందుకు సిద్దం అని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే ఇందులో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు విప్లాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్, ఈ నిర్ణయం తో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.