లాక్ డౌన్ విషయంలో సీరియస్ అవుతున్న సీఎం కేసీఆర్ – ఎందుకంటే…?

Thursday, March 26th, 2020, 07:47:44 AM IST


ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ లో భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తున్న తరుణంలో ఎలాగైనా సరే ఈ మహమ్మారి అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చర్యలను చేపట్టాయి… అందులో భాగంగానే మొత్తం దేశంలో 21 రోజులు లాక్ డౌన్ విధించడానికి ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ లాక్ డౌన్ అంశాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ లాక్ డౌన్ అంశం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సీరియస్ అవుతున్నారని సమాచారం. ఎందుకంటే… ఈ లాక్ డౌన్ లో భాగంగా రాష్ట్రంలో విధిస్తున్న కర్ఫ్యూ ని కొందరు ప్రజలు తప్పు దోవ పట్టిస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ లాక్ డౌన్ చర్యలను మరింతగా కట్టుదిట్టం చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరి సహకారంతో అధికారులందరూ కూడా ముందుకు సాగాలని, అంతేకాకుండా రాష్ట్రంలో పోలీసులు నిర్వహిస్తున్న చెక్ పోస్టులను మరింత పటిష్టంగా చేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను రోడ్లపైకి రాకుండా చేయాలనీ, ప్రజలు ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరాన్ని పాటించాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంగిస్తే తప్పకుండ వారికి జైలు జీవితం తప్పదని, అందుకని దీనికి అందరు కూడా సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు,