మార్పు కనిపించాలి.. రెవెన్యూ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ సూచన..!

Sunday, September 13th, 2020, 03:00:59 AM IST

KCR
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను నేడు రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులకు కొన్ని సూచనలు చేశారు. ప్రజలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని, కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు.

అయితే రెవెన్యూ కార్యాయాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికతో వినాలని అన్నారు. రెవెన్యూశాఖలో అన్ని స్థాయిల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని, తహసీల్దార్లకు కారు అలవెన్సు ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు. వయోభారం ఉన్న వీఆర్వోల పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, వీఆర్‌ఏలను స్కేల్ ఉద్యోగులుగా పరిగణిస్తుండడంతో ప్రభుత్వంపై అదనంగా 260 కోట్ల అదనపు భారం పడుతున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.