నీళ్ళతో ముడిపడే తెలంగాణ ఉద్యమం సాగింది – కేసీఆర్

Friday, October 2nd, 2020, 12:11:17 AM IST


జల వివాదాల పై ఈ నెల 6 న జరగనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీ లో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే వ్యవసాయ రంగం, రైతుల రక్షణ కోసం దేవుడి తో నైనా కొట్లాట కి సిద్దం అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నీళ్ళ తో ముడి పడే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాగింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అంతేకాక పంటల దిగుబడి లో మన రైతు దేశానికే ఆదర్శం గా నిలిచాడు అని సీఎం కేసీఆర్ అన్నారు.

అయితే దేశానికే ధాన్యాగారం గా తెలంగాణ రాష్ట్రం మారింది అని, సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు బీళ్ళ ను పచ్చగా మారుస్తున్నాం అని సీఎం కేసీఆర్ సమావేశం లో అన్నారు. గోదావరి, కృష్ణా జలాల్లో హక్కుగా వచ్చే ప్రతి చుక్కను కూడా వాడుకుంటాం అని తెలిపారు. అయితే అపెక్స్ కౌన్సిల్ భేటీ లో రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే ఈ వ్యవహారం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కి ధీటుగా జవాబు ఇవ్వాలి అని ఈ సమీక్ష లో సీఎం కేసీఆర్ అధికారుల కి ఆదేశాలను జారీ చేశారు.