రాష్ట్రంలో శాంతిభ్రదతలపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష..!

Wednesday, October 7th, 2020, 08:38:44 AM IST

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణపై నేడు సీఎం కేసీఆర్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు నేడు ప్రగతి భవన్‌లో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే హోంశాఖ, అటవీ శాఖ మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, కార్యదర్శులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీపీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు సమావేశానికి హాజరుకానున్నారు.