ఆ ఎమ్మెల్యే అందరికి స్పూర్తి.. సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లులు..!

Thursday, December 31st, 2020, 01:09:46 AM IST


టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లులు కురిపించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన కోనప్ప కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురుంచి వివరించారు.

అయితే నిత్యం నియోజకవర్గంలో 1000 మందికి అన్నదానం చేయడం, ప్రభుత్వ స్కూళ్లకు టీవీలు అందజేయడం, పోలీస్, మిలిటరీ ఫారెస్టు పోస్టులకు దరఖాస్తుచేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం, ఎస్సీ, ఎస్టీలకు సామాహిక వివాహాలు జరిపించడం, ఇంటర్‌ కాలేజీల్లో మధ్యాహ్నభోజనం పెట్టడం, రక్తహీనత ఉన్న మహిళలకు పోషకాహారం అందించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అందరికి స్పూర్తిగా నిలుస్తున్నారని సీఎం కేసీఆర్ ఆయనను అభినందించారు.