అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్.. యశోదా ఆసుపత్రిలో పరీక్షలు..!

Thursday, January 7th, 2021, 02:45:39 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ఫ అస్వస్థతకు గురయ్యారు. నిన్నటి నుంచి సీఎం కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో మంటగా ఉన్నట్టు తెలిసింది. అయితే నిన్న సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఎం.ఆర్.ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరం కావడంతో వైద్యుల సూచన మేరకు సీఎం కేసీఆర్ ఈ రోజు సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తుంది.