మాజీ హోంమంత్రి నాయినిని పరామర్శించిన సీఎం కేసీఆర్

Wednesday, October 21st, 2020, 06:39:38 PM IST

టీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. కొద్ది రోజుల క్రితమ ఆయనకు కరోనా సోకగా బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం కరోనా నెగిటివ్ వచ్చి కుదుటపడుతున్న ఆయనకు నిమోనియా సోకింది. శ్వాససంబంధ సమస్యలు తలెత్తడంతో ప్రస్తుతం నాయినికి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అయితే ఇన్సెంటివ్ కేర్‌లో చికిత్స పొందుతున్న నాయిని ఆరోగ్యం రోజు రోజుకు విషమంగా మారుతుంది. అయితే నేడు నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్, అనంత‌రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. నాయినికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అంతేకాదు నాయిని కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ధైర్యం చెబుతూ త్వరలోనే ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు.