తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీ ప్రకటన తేదీ ఫిక్స్..!

Saturday, March 20th, 2021, 10:00:32 AM IST

తెలంగాణ ఉద్యోగులు రెండున్నర ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేతన సవరణ అంశానికి సంబంధించి కీలక ప్రకటన చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ నెల 22న సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్‌పై ప్రసంగిస్తారు. అయితే అదే రోజు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. అయితే వేతన సవరణతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం మాదిరిగానే తెలంగాణ ఉద్యోగులకు అందిస్తున్న ఈహెచ్ఎస్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తదితర అంశాలపై సైతం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు వెలువరిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో అమలవుతున్న మధ్యంతర భృతి కన్నా మన వారికి కనీసం రెండు శాతం ఎక్కువే ఫిట్మెంట్ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుకొచ్చారు. అయితే 29-31% వరకు ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో ఈ నెల 22న ఆయా రానున్న అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.