అసెంబ్లీ సమావేశాలపై మాస్టర్ ప్లాన్ రెడీ చేసిన సీఎం కేసీఅర్..!

Friday, September 4th, 2020, 07:26:53 AM IST

KCR

తెలంగాణలో ఈ నెల 7వ తేది నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. అయితే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాలలో కూలంకశంగా చర్చ జరపాలని, ఎన్ని రోజులైనా అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు.

అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాలు అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందో సభ్యులు విశ్లేషించాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణ, కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, పీవీ శతజయంతి ఉత్సవాలు, కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు తదితర అంశాలను చర్చించాలని అసెంబ్లీలో చర్చకు వచ్చే అన్ని అంశాలపై మంత్రులు పక్కా సమాచారంతో సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చ జరగడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి చట్ట సభలకు మించిన వేదిక లేదని, ఈ వేదికను సద్వినియోగం చేసుకుని దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ శాసనసభను నిర్వహించాలని అన్నారు.