ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విధించం – సీఎం కేసీఆర్

Friday, March 26th, 2021, 02:26:36 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. మళ్ళీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే కేసుల పెరుగుదల తో రాష్ట్రం లో లాక్ డౌన్ విధిస్తారా లేదా అనే దాని పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం పరిస్థితుల ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కొందరు సినీ పెద్దలు తనను కలిసి లాక్ డౌన్ పై వస్తున్న ప్రచారం గురించి అడిగిన విషయాన్ని కేసీఆర్ వెల్లడించారు. లాక్ డౌన్ విధించే అవకాశం ఉందా అని అడిగిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఇప్పటికే పెట్టుబడులు పెట్టాం అని, కొన్ని సినిమాలు నిర్మాణం మధ్యలో ఉన్నాయని చెప్పిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక లాక్ డౌన్ కారణంగా గతేడాది నష్టపోయిన విషయాన్ని సీఎం కేసీఆర్ కి తెలిపిన విజయాన్ని వెల్లడించారు.

అయితే తొందరపడి లాక్ డౌన్ పెట్టబొం అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విదించం అని స్పష్టత ఇచ్చారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి విస్పోటనమైన రూపం తీసుకోక ముందే చర్యలు తీసుకున్నాం అని వ్యాఖ్యానించారు. అయితే బాధ తోనే విద్యా సంస్థలను మూసి వేసినట్లు కేసీఆర్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి ఎవరికి అంతు పట్టకుండా తెలంగాణ సహా ప్రపంచాన్ని వేధిస్తోంది అని అన్నారు. అయితే వాక్సినేషన్ ప్రక్రియ కేంద్రం చేతుల్లో ఉందని, అన్ని రాష్ట్రాలకు కూడా సమానం గా పంపిణీ చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తో ఒక స్పష్టత వచ్చింది.