ఇకపై కేవలం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..!

Monday, September 14th, 2020, 01:25:02 PM IST

KCR_1706

కొత్త రెవెన్యూ చట్టంపై నేడు శాసన మండలిలో మాట్లాడిన సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని అందుకే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే ఇకపై కేవలం 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని మునుపటిలా ఆఫీసుల వెంబడి తిరిగే అవసరం ఉండదని అన్నారు. అంతేకాదు ఇంట్లో పెద్దాయన చనిపోతే అతని ఆస్తి aపంపకాలపై వారసులంతా ఒక అవగాహనతో సంతకాలు పెట్టుకుని వస్తే దాని ప్రకారమే రిజిస్ట్రేషన్ చేస్తామని అన్నారు.

అయితే ఆస్తి పంపకాలపై కోర్టుకు వెళ్ళాలనుకునే వారి గురుంచి ప్రభుత్వం ఆలోచించదని అన్నారు. ఇక రిజిస్ట్రేషన్ రేట్లను కూడా త్వరలో నోటిపై చేస్తామన్నారు. ఇదిలా ఉంటే రిటైర్డ్ ఉద్యోగులు, కారుణ్య నియామకాలపై త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని, ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక వ్యవస్థ ఉండాలని, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ చేసేటప్పటికి వారి స్కేల్ ఎంత, ఎంత వస్తుంది, రిటైర్డ్ అయ్యే రోజు ఎంత వస్తుందో లెక్కలు పూర్తయ్యి ఉండాలని అన్నారు.