దుబ్బాక ఎన్నికలలో గెలుపు టీఆర్ఎస్‌దే.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!

Friday, October 30th, 2020, 12:07:37 AM IST


దుబ్బాక ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ దుబ్బాక ఎన్నికలు టీఆర్ఎస్‌కు పెద్ద లెక్కే కాదని, టీఆర్ఎస్ గెలుపు ఎఫ్పుడో డిసైడయ్యిందని అన్నారు. దుబ్బాకలో మంచి మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

అయితే చిల్లర తతంగాలు నడుస్తునే ఉంటాయని అలాంటి వాటిని తాము పట్టించుకోమని అన్నారు. గ్రౌండ్‌ చాలా క్లియర్‌గా ఉందని అన్నారు. ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నికలో రాజకీయం రణరంగంలా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించుకుని ప్రత్యర్ధి పార్టీలకు బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, ఈ ఎన్నికలలో గెలిచి రానున్న ఎన్నికలలో తమదే అధికారం అని చెప్పుకోవాలని కాంగ్రెస్, బీజేపీ తహతహలాడుతున్నాయి.