పీఆర్సీ ఆలస్యం అవ్వడానికి కారణాలు చెప్పిన కేసీఆర్

Monday, March 22nd, 2021, 01:08:23 PM IST

తెలంగాణ రాష్ట్రం లో ప్రతి ఐదేళ్ళకొకసారి ప్రతి పీఆర్సీ ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యం లో అసెంబ్లీ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ పై కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ హోం గార్డ్ లకు, వీ ఆర్ ఏ లకు, ఆశా వర్కర్లకి, అంగన్ వాడి లకు పీఆర్సీ వర్తించనుంది. అంతేకాక పీఆర్సీ ఆలస్యం అవ్వడానికి గల కారణాలను సీఎం కేసీఆర్ వెల్లడించారు. కరోనా, ఆర్ధిక మాంద్యం వలన పీఆర్సీ ఆలస్యం అయింది అని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర అభివృద్ది లో ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమైనది అని,ఉమ్మడి రాష్ట్రంలో కూడా టి ఎన్ జీ వో సంస్థ పేరు మార్చుకోలేదు అని వ్యాఖ్యానించారు. టీ ఎన్ జి వో కూడా ఒక స్పూర్తి అంటూ కేసీఆర్ కొనియాడారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన తో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.