బిగ్ ట్విస్ట్: ప్రగతి భవన్ ముట్టడి కేసులో కేసీఆర్ మనవడు..!

Thursday, August 13th, 2020, 03:43:38 PM IST

తెలంగాణలో ఓ పక్క కరోనా కేసులు పెరుగుతుంటే మరో పక్క ప్రభుత్వం ఓయూ, యూజీసెట్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో విశ్వ విద్యాలయాలలో పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ణ్శూఈ కార్యకర్తలు నిన్న ప్రగతి భవన్‌ని ముట్టడించిన సంగతి తెలిసిందే.

పీపీఈ కిట్లు ధరించి ప్రగతి భవన్‌కి చేరుకున్న విద్యార్థి సంఘం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారందరిని పోలీసులు అడ్డుకోని అదుపులోకి తీసుకోగా నేడు వారికి 14 రోజులు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదంత పక్కనపెడితే ఈ కేసులో ఓ బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వారిలో కేసీఆర్ మనవడు రితేష్ ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో రితేష్‌‌ను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో ఏ5గా చేర్చారు. దీంతో రితేష్ తల్లి కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.