నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

Sunday, December 13th, 2020, 10:24:30 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నీ టీచర్లు మరియు పోలీస్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ, పోలీస్ భర్టిలు మాత్రమే కాకుండా, రాష్ట్రం లో మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన సోమేష్ కుమార్ ను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు విభాగాల్లో మాత్రమే కాకుండా, మిగతా శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు సేకరించాలి అని ఆదేశించారు. అయితే పూర్తి వివరాలు అందిన అనంతరం త్వరలో నోటిఫికషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ తీసుకొన్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు వరంగా మారనుంది.