బిగ్ న్యూస్: ఆర్టీసి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

Sunday, November 15th, 2020, 07:30:24 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసి ఉద్యోగులకు ఒక శుభ వార్త చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి కారణం గా లాక్ డౌన్ సమయం లో ఉద్యోగులు నష్టపోయిన సంగతి తెలిసిందే.వారికి వేతనాల్లో కోతలు కూడా విధించడం జరిగింది. అయితే వారికి కోత విధించిన మొత్తాన్ని చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాల ను జారీ చేశారు. అయితే ఆర్టీసి పై మంత్రి పువ్వాడ, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే రెండు నెలల పాటు కోత విధించిన 50 శాతాన్ని చెల్లించాలని, దీనికి అవసరం అయిన 130 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాక హైదరాబాద్ మహ నగరం లో 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసి ఎండీ సునీల్ శర్మ కి సీఎం కేసీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తో ఆర్టీసి ఉద్యోగుల్లో సంతోషం నెలకొంది.