శ్రీశైలం ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి.. సీఐడీ విచారణకు ఆదేశం..!

Saturday, August 22nd, 2020, 01:30:12 AM IST


శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలం విద్యుత్తు కేంద్రంలో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు ఆరు మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. అయితే దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా సీఐడీ అడిషనల్‌ డీజీపీ గోవింద్‌సింగ్‌‌ను నియమించారు. ఈ ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని వారికి సూచించారు. ఇకపోతే ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.