గెలుపు బాధ్యత మీదే.. ఆ ముగ్గురు మంత్రులకు సీఎం కేసీఆర్ సజేషన్స్..!

Saturday, February 27th, 2021, 03:00:34 AM IST


తెలంగాణలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ సవాల్‌గా తీసుకుంది. గతేడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన పలితాలు రాకపోవడంతో ఈ ఎన్నికలపై టీఆర్ఎస్ సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ క్రమంలో నేడు పలువురు మంత్రులతో సమావేశమైన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను పలువురు మంత్రులకు అప్పగించినట్టు తెలుస్తుంది.

అయితే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాలకు సీఎం కేసీఆర్ ముగ్గురు మంత్రులను నియమించారు. హైదరాబాద్‌కు మంత్రి గంగుల కమలాకర్‌ని, రంగారెడ్డికి మంత్రి హరీశ్ రావును, మహబూబ్‌నగర్ బాధ్యతలను మంత్రి ప్రశాంత్ రెడ్డికి అప్పగించినట్టు సమాచారం. అయితే నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానాల బాధ్యతలను కూడా పలువురు మంత్రులకు అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికలను అత్యంత సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించిన నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.