ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించిన సీఎం కేసీఆర్..!

Friday, February 5th, 2021, 03:35:12 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాలలో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు దీనిపై అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించింది సీఎం కేసీఆర్‌కి అందించారు.