ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించిన సీఎం కేసీఆర్..!

Tuesday, January 12th, 2021, 02:19:59 AM IST


తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో గుడ్‌న్యూస్ అందించారు. ఇటీవల రాష్ట్రంలోని ఉద్యోగుందరికీ వేతనాలు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగుల ప్రమోషన్ల కోసం కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

అయితే రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామకాలను సైతం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపధ్యంలోనే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే ప్రక్రియను ముమ్మరం చేసింది. ప్రమోషన్ల ప్రక్రియ పూర్తైన అనంతరం ఖాళీల సంఖ్య పూర్తి స్థాయిలో తేలనుంది. ఆ తర్వాత అన్ని శాఖలలో ఖాళీలను గుర్తుంచి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.