గవర్నర్ కోటాలో ముగ్గురి ఎమ్మెల్సీల పేర్లు ఖరారు చేసిన సీఎం కేసీఆర్..!

Friday, November 13th, 2020, 07:27:08 PM IST

గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మూడు స్థానాలను భర్తీ చేయాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. ఎస్సీ, బీసీ, ఓసీ సామాజికవర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించారు.

అయితే ఎస్సీ కోటాలో ఉద్యమకారుడు, ప్రజాకవి గోరెటి వెంకన్నకు అవకాశం కల్పించగా, బీసీ కోటాలో మాజీమంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్యకు, ఓసీ కోటాలో వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. ఈ ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. అయితే రేపే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.