వైరల్ వీడియో: యాదాద్రి ఆలయం వద్ద సీఎం కేసీఆర్ ఏం చేశారో చూడండి..!

Sunday, September 13th, 2020, 09:00:22 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి ఆలయం ను సందర్శించారు. లక్ష్మి నరసింహ స్వామీ ను దర్శించుకున్నారు సీఎం కేసీఆర్. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించారు. అంతేకాక ఆలయ పునర్నిర్మాణం పనుల్ని పరిశీలించడం తో పాటుగా, అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. అయితే ఆలయ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.

అంతేకాక పూర్తి స్థాయిలో కొండపై జరుగుతున్న అభివృద్ది పనులను సైతం కూడా సీఎం కేసీఆర్ పరిశీలించారు. అయితే యాదాద్రి లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ఉన్న కోతులకు అరటి పండ్లను అందజేశారు. అక్కడ పదుల సంఖ్యలో చేరుకున్న కోతులకు సీఎం కేసీఆర్ అరటి పండ్లను అందజేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్రం లో అభివృద్ది కొరకు పలు విప్లవాత్మక మార్పులు తీసుకుంటున్న కేసీఆర్, పాలన పరంగా దూసుకుపోతున్నారు.