సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు తప్పిన పెను ప్రమాదం..!

Friday, February 26th, 2021, 12:30:09 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు పెను ప్రమాదం తప్పింది. కవిత ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాల్లో ఒకదానిని మరొకటి ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ కవిత సురక్షితంగా బయటపడ్దారు. నేడు జగిత్యాల జిల్లాలో కవిత పర్యటించింది. అయితే కొండగట్టు నుంచి రాయికల్ వెళ్లే క్రమంలో మల్యాల మండలం రాజారాం గ్రామం దగ్గర కవిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో కాన్వాయ్ లోని 5 కార్లు వెనక నుంచి ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ప్రమాద సమయంలో కవిత కారులో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ కూడా‌ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కాసేపటి తర్వాత వేరే కారులో కవిత అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.