సీఎం కేసీఆర్ కాన్వాయ్ కారుకి జరిమానా.. ఎంతంటే..!

Thursday, June 4th, 2020, 02:00:32 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ లోని ఓ కారుకు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, సూర్యాపేట పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫైన్ వేశారు.

అయితే TS 09 K 6666 గల ల్యాన్డ్ క్రూజన్ ప్రాడో కారు పరిమితికి మించిన వేగంతో నాలుగు సార్లు ప్రయాణించినందుకు గాను చలానా విధించినట్టు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో చలానా మొత్తం 4,140ను సీఎం కార్యాలయం అధికారులు నేడు చెల్లించారు.