కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్…

Thursday, February 13th, 2020, 11:11:33 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక సమీక్ష సమావేశాన్నినిర్వహించారు. కాగా కరీంనగర్ కి సంబందించిన మంత్రులు, సంబంధిత అధికారులతో కలిసి కరీంనగర్ లోని కలెక్టరేట్ లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ సంబంధిత నీటి సరఫరా, ప్రాజెక్టుల నిర్వహణ, సంబంధిత విషయాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

అయితే ముందుగా సీఎం కేసీఆర్ భూపాలపల్లిలో గోదావరి పుష్కర ఘాట్ కి చేరుకొని, గోదావరికి పలు పూజలు చేశారు. అంతేకాకుండా గోదావరి నామాట కి చీరె, సారె సమకూర్చారు. ఆ తరువాత కాళేశ్వరంలో ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్ ఆ తరువాత సమీక్షగా సమావేశంలో పాల్గొన్నారు.