అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు…ఆ ఘనత వైఎస్సార్ దే!

Wednesday, March 17th, 2021, 04:15:10 PM IST

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత వైఎస్సార్ దే అంటూ చెప్పుకొచ్చారు. మేం అమలు చేశామని డబ్బాలు కొట్టుకొనే అలవాటు మాకు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తున్న విషయాన్ని వెల్లడించారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి విషయం లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటిస్తున్నాం అని కేసీఆర్ అన్నారు. ఆసుపత్రులలో అన్ని వసతులు కల్పించాం అని, కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ మేరకు బుధవారం నాడు వెల్లడించారు.

అయితే పాత సచివాలయం స్థానం లో ప్రార్థనా మందిరాలను పునర్నిర్మిస్తామని అన్నారు. 39.36 లక్షల మందికి రాష్ట్రంలో ఫించన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. భూ సేకరణ ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు అని, సంక్షేమానికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఇంకా రాష్ట్ర గీతం నిర్ణయించలేదు అని స్పష్టం చేశారు. పెట్రోల్ ధరల అదుపు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని, న్యాయవాదుల హత్య కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు అని, అయితే పార్టీ కి చెందిన మండల అధ్యక్షుడు హస్తం ఉందని తెలియడం తో పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.