జాతీయ పార్టీ ఏర్పాటు పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Tuesday, September 8th, 2020, 01:01:01 AM IST

KCR

తెలంగాణ రాష్ట్రం లో పలు కీలక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త రెవెన్యూ బిల్లును ఎల్లుండి శాసన సభ లో ప్రవేశ పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన సీఎం కేసీఆర్, పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో నే ఎక్కడా లేని విధంగా రెవెన్యూ చట్టం రాబోతుంది అని అన్నారు. అయితే ఈ రెవెన్యూ చట్టం గురించి ప్రజలకు సరైన విధంగా వివరించాలి అని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే లకు సూచించారు.

అయితే శాసన సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం కేసీఆర్ వారికి వివరించడం జరిగింది. అయితే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి అని, ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుండి సైతం పలు ప్రశంసలు అందుకున్నారు. పలు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. అయితే దీని పై సీఎం కేసీఆర్ ఇలా అన్నారు. ప్రస్తుతానికి జాతీయ పార్టీ ఆలోచన లేదు అని, సమయం వచ్చినప్పుడు అందరితో చర్చించి పెడతాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.