ఏపీ కి బలంగా సమాధానం చెప్పాలి – సీఎం కేసీఆర్!

Tuesday, August 11th, 2020, 03:00:54 AM IST

KCR_1706
ఏపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రాజక్ట్ ల పై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టుల విషయం లో ఏపీ ఫిర్యాదులు సరైనవి కావు అని అభిప్రాయ పడ్డారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని ఘాటు విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. అయితే ఈసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం లో తమ వాదనలు సమర్థవంతంగా వినిపించాలి అని, వాస్తవాలను, సంపూర్ణ సమాచారం తో కేంద్రానికి, ఏపీ కు బలంగా సమాధానం చెప్పాలి అని కేసీఆర్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. వృధాగా పోతున్న నీటిని పొలాలకు మళ్ళించే కార్యాచరణ అమలు చేద్దాం అని అన్నాను, కానీ ఏపీ ప్రభుత్వం కెలికి మరి కయ్యం పెట్టుకుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్.

అంతేకాక ఏపీ అర్థరహిత వాదనలను తిప్పి కొట్టేలా సమాధానం ఇస్తామని, రాష్ట్ర ప్రాజెక్టుల పై మరొకసారి నోరు ఎత్తి మాట్లాడలేని పరిస్తితి ను ఏపీ కి కల్పిస్తాం అని కేసీఆర్ ఘాటుగా బదులు ఇచ్చారు. పిలిచి మరీ మాట్లాడి రైతుల ప్రయోజనాల గురించి చర్చలు జరిపిన అనంతరం ఇటువంటి పరిస్థితులు ఎదురు కావడం పట్ల కేసీఆర్ మండిపడ్డారు.