తెలంగాణ సచివాలయం డిజైన్ ఫైనల్.. కేబినెట్ ఆమోదం..!

Thursday, August 6th, 2020, 11:00:01 AM IST

secretariat building design

తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులు దాదాపుగా పూర్తయిన నేపధ్యంలో కొత్త సచివాలయం డిజైన్‌పై గత కొద్ది రోజులుగా ప్రభుత్వం కసరత్తు చేపడుతుంది. పలు మార్లు దీనిపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ కొన్ని మార్పులు కూడా సూచించారు. అయితే తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త సచివాలయ డిజైన్‌తో పాటు సచివాలయ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపారు.

అయితే కొత్త సచివాలయంలో మంత్రులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్‌లు అన్ని సౌకర్యాలతో ఉండేలా నిర్మిస్తున్నారని, ప్రతి అంతస్తులో డైనింగ్‌ హాల్‌, మీటింగ్‌ హాల్‌, సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాల్‌, అన్ని వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం ఉండేలా నమూనాను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.