ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో వివాహ వేడుకకు హజరైన సీఎం కేసీఆర్

Wednesday, September 23rd, 2020, 02:08:33 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కీలక పాత్ర పోషిస్తున్న ఓవైసీ అసదుద్దీన్, దేశ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హజరు అయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటుగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరియు మహమూద్ అలీ లు సైతం హజరు అయ్యారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు కీలక రాజకీయ నేతలు హజరు అయినట్లు తెలుస్తోంది. అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులతో, సీఎం కేసీఆర్ మరియు ఇతర కీలక నేతలు హజరు అయిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.