సీఎం కేసీఆర్ మరొక సంచలన నిర్ణయం – ఇకనుండి డిజిల్ వాహనాలు కనిపించవేమో…?

Friday, February 14th, 2020, 03:38:34 PM IST

గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాల వలన రాష్ట్రంలోని ప్రతిపక్షాల నుండి ఎన్నో విమర్శలు ఎదురైనప్పటికి కూడా సీఎం కేసీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గినా దాఖలాలు కనిపించవు. అయితే ఇలాంటి తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

కాగా ఇప్పటికే మెట్రో నగరాల్లో పెరుగుతున్న వాహనాల కారణంగా తీవ్రమైన వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఇంతటి వాయు కాలుష్యం నుండి బయట పడాలంటే ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటు, అనేక మాస్కులను ధరించి రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అలాంటి దారుణమైన పరిస్థితులు ఇంకా ఎక్కువ కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యలు జరపనుంది. కాగా ఇటీవల జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో కూడా కేసీఆర్ హైదరాబాద్ లోని డీజిల్ వాహనాల కోసం ప్రత్యేకంగా చర్చలు జరిపారని సమాచారం. \

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా వాయు కాలుష్యం పెరగకముందే అధిక సంఖ్యలో మొక్కలు నాటుతూ, డీజిల్ వాహనాలను సైతం నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని చేపట్టాలని అధికారులకు తెలిపారు. అయితే ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం కేవలం హైదరాబాద్ లోనే 15 లక్షలకి పైగా డీజిల్ వాహనాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా ఇక్కడ డిజిల్ వాహనాలను తగ్గించి బ్యాటరీ వాహనాలపై ఫోకస్ చేయాలనీ సీఎం కేసీఆర్ ఆదేశించారని సమాచారం.