సీఎం కేసీఆర్ మరొక సంచలన నిర్ణయం – ప్రత్యేక డ్రోన్లు ఏర్పాటు…

Friday, April 3rd, 2020, 11:17:13 AM IST

తెలంగాణ రాష్ట్రంలో భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ కి సంబందించిన కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా సీఎం కేసీఆర్ ప్రజలందరికోసం ఆలోచించి తీసుకున్ననిర్ణయం కారణంగా కరోనా ని కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ప్రార్థనల కారణంగా ఈ కరోనా వైరస్ కేసులు రాష్ట్రంలోమరింతగా పెరుగుతున్నాయి. కాగా గురువారం నాడు ఒక్కరోజే దాదాపుగా రాష్ట్రంలో 27 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో బాధితుల సంఖ్య 154 కు చేరింది. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరొక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారని సమాచారం.

ఈ మేరకు ఇప్పటికే ఇతర దేశాల్లో అమలులోఉన్న డ్రోన్ల ద్వారా కెమికల్స్ ని స్ప్రే చేయడానికి నిర్ణయించుకున్నారు. కాగా అన్ని ప్రదాన ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించి ప్రత్యేక స్ప్రే చేయించాలని, అక్కడి ప్రాంతాలను పూర్తిగా శానిటైజ్ చేయదానికి నిర్ణయించుకున్నారని సమాచారం. కాగా ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోని ముకరంపూర్ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా భావించి అత్యాధునిక డ్రోన్ ల సహాయంతో పూర్తిగా శానిటైజ్ చేసింది. దానితో పాటే వరంగల్, లాంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా డ్రోన్ల సహాయంతో ఈ స్ప్రే చేయనున్నారు. అయితే ఈప్రక్రియకు అవసరమైన డ్రోన్లను మారుతీ డ్రోన్ టెక్ అనే కంపెనీ డ్రోన్ లను పంపిణీ చేయనుందని సమాచారం. ఈ డ్రోన్లతో పాటే స్పీకర్ల సహాయంతో పలు హెచ్చరికలు కూడా జారీ చేయనున్నారు.