ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్ అందించిన సీఎం కేసీఆర్..!

Wednesday, December 30th, 2020, 01:14:32 AM IST


తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికి సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును కూడా పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

అయితే ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు ఉంటుందని, రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని అందరికి జీతాల పెంపు వర్తిస్తుందని అన్నారు. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించామని, దీని వల్ల ఆర్టీసీపై పడే భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.