ఈ పరిస్థితుల్లో సినీ పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది – సీఎం కేసీఆర్

Sunday, November 22nd, 2020, 09:00:38 PM IST

కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమ పై ఎక్కువగా ఉందని చెప్పాలి. అయితే సినీ పరిశ్రమ ను కాపాడుకోవడానికి అవసరం అయిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. థియేటర్లను మూసి వేయడం వలన పరిశ్రమలకు , కార్మికులకు నష్టం జరిగింది అని, దీని నుండి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీ లు, మినహాయింపు లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి ఎన్నో చర్యలు తీసుకుంటోంది, అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడకొకపోతే ఎలా అని కేసీఆర్ అన్నారు.

దేశంలో ముంబై, చెన్నై లతో పాటుగా హైదరాబాద్ లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉందని కేసీఆర్ అన్నారు. ఈ పరిశ్రమ ద్వారా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది అని,కరోనా కారణంగా ఈ పరిశ్రమ కి ఇబ్బంది కలిగింది అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఇటు ప్రభుత్వం, అటు సినీ పరిశ్రమ పెద్దలు పరిశ్రమను కాపాడుకోవదానికి సంయుక్తంగా ప్రయత్నాలు చేయాలని కోరారు. ప్రభుత్వ పరంగా సినీ పరిశ్రమ ను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం అని కేసీఆర్ హామీ ఇచ్చారు.