వందేళ్ళలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి – కేసీఆర్

Wednesday, October 21st, 2020, 03:45:59 PM IST

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపద్యం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తం గా ఉండాలి అని సూచించారు. అయితే మొత్తం హైదరాబాద్ అంతటా కూడా 15 ప్రత్యేక సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అయితే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని చెరువుల్లోకి ఎక్కువగా నీరు చేరుతున్న సంగతి తెలిసిందే. అయితే చెరువుల పరిస్తితి ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలను తీసుకోవాలి అని సూచించారు.

అయితే సీఎం కేసీఆర్ హైదరాబాద్ వర్షాల పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో వందేళ్ల లో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయి అని పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని, చెరువులు నిండటం వలన గండ్లు పడినా, కట్టలు తెగినా కూడా మరమ్మత్తులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీఎం కేసీఆర్ సైతం 155 కోట్ల రూపాయల ను తక్షణ సహాయక చర్యలకోసం మంజూరు చేసిన సంగతి తెలిసిందే.