రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారు – సీఎం కేసీఆర్

Sunday, December 6th, 2020, 03:40:22 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల బిల్లులను పలువురు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు నష్టం చేకూర్చేలా బిల్లులు ఉన్నాయి అంటూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే మరోమారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దీని పై స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఈ నెల 8 న భారత్ బంద్ కి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ భారత్ బంద్ కి తెరాస ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలిపింది. అయితే ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెరాస శ్రేణులు ప్రత్యక్షంగా ఈ బంద్ లో పాల్గొంటాయి అని తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం న్యాయమైనది అని అన్నారు. అయితే ఈ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉండటం వలనే తెరాస వాటిని పార్లమెంట్ లో వ్యతిరేకించింది అని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే నూతన వ్యవసాయ చట్టాలను ఉప సంహరించుకొనే వరకు పోరాటం కొనసాగించాల్సి న అవసరం ఉంది అని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. భారత్ బంద్ విజయవంతం అవ్వడానికి తెరాస కృషి చేస్తుంది అని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకాక రైతులకు ప్రజలు అందరూ కూడా అండగా నిలవాలని సీఎం కేసీఆర్ కోరారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోమారు హాట్ టాపిక్ గా మారాయి.