గ్రామ వాలంటీర్లకు బహిరంగ లేఖ రాసిన సీఎం జగన్..!

Wednesday, February 10th, 2021, 02:10:16 AM IST


ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకు చేరవేసేలా వాలంటీర్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇటీవల రేషన్ పంపిణీ వాహదారులకు జీతాలు పెంచిన నేపథ్యంలో వాలంటీర్లు కూడా తమకు జీతాలు పెంచాలని రోడెక్కి ఆందోళనకు దిగారు. అయితే ప్రభుత్వం తరఫు నుంచి అన్ని సంక్షేమ పథకాలను తాము ఇంటింటికీ చేరవేస్తూ అతి తక్కువ జీతానికి పనిచేస్తున్నామని, కరోనా కష్ట సమయంలో కూడా తాము సేవలందించామని తమకు కూడా వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే దీనిపై స్పందించిన సీఎం జగన్ వాలంటీర్లకు లేఖ రాశారు. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ అందించడమని ఇది ఉద్యోగం కాదని అన్నారు. అయినప్పటికి గౌరవ వేతనం అందిస్తున్నామని ఈ వ్యవస్థను ప్రారంభించినప్పుడే ఇది కేవలం స్వచ్ఛంద సేవ మాత్రమేననే విషయాన్ని స్పష్టం చేశానన్న అంశాన్ని లేఖలో స్పష్టం చేశారు. రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పనిచేయాలన్న నిబంధనలు కూడా ఏమీ లేవని అన్నారు. అయితే వాలంటీర్ల వ్యవస్థకు వస్తున్న పేరును చూసి తట్టుకోలేకే కొందరు ఇలా కుట్రలు చేస్తున్నారని ఆ ట్రాప్‌లో పడొద్దని సీఎం జగన్ సూచించారు.