బిగ్ న్యూస్: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై మోడీకి సీఎం జగన్ లేఖ

Tuesday, March 9th, 2021, 01:23:38 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయం లో కార్మికులు, నిర్వాసితులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసినటువంటి ప్రకటన పై మాట్లాడేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలి అని లేఖ లో కోరారు జగన్. అఖిల పక్షం తో కలిసి విశాఖ ఉక్కు పై ప్రధాని నరేంద్ర మోడీ తో మాట్లాడేందుకు అనుమతి కావాలి అంటూ లేఖ లో పేర్కొన్నారు.అయితే వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ విషయం లో పునః పరిశీలించాలి అంటూ లేఖ లో కోరారు. అయితే గతంలో రాసిన లేఖ లోని పలు అంశాలను మళ్ళీ ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి కి తీసుకెళ్లారు. ఆర్ఐఎన్ఎల్ ను లాభాల బాట పట్టించేందుకు ఉక్కు శాఖ మంత్రి కి సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.

అయితే ఆర్ ఐ ఎన్ ఎల్ వద్ద ఏడు వేల ఎకరాల ఉపయోగించని భూమి ఉందని, ప్లాట్ల కింద మార్చి ఆర్ ఐ ఎన్ ఎల్ ను ఆర్దికంగా బలపరచవచ్చు అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అయితే నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నిరసనలు భగ్గుమంటున్నాయి. వైసీపీ నేతల పై, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల పై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.