బిగ్ న్యూస్: ఎస్పీ బాలు కి భారత రత్న ఇవ్వండి – వైఎస్ జగన్

Monday, September 28th, 2020, 05:22:38 PM IST

ఇటీవల అనారోగ్యం కారణం గా మృతి చెందిన ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి ప్రతి సినీ, సంగీత ప్రేమికుడిని కన్నీటి పర్యంతం చేసింది. అయితే ఈ గాన గంధర్వుడు కి భారత రత్న ఇవ్వాలి అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని కోరడం జరిగింది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. ఆ లేఖ లో పలు విషయాలను ప్రస్తావించారు.

దశాబ్దాల కాలం పాటు సింగర్ గా ఏక చత్రాదిపతి గా వెలిగిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 16 బాషల్లో 40 వేలకు పైగా పాటలను పాడారు. పలు భాషల్లో పాడిన పాటలు ప్రజల మనసుల్లో నాటుకు పోయాయి. అయితే గతం లో సంగీత విభాగం లో ఎనలేని కృషి చేసిన పలువురికి భారత రత్న ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ లేఖ లో ప్రస్తావించారు. అయితే సోషల్ మీడియా లో సైతం నెటిజన్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి భారత రత్న ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎస్పీ బాలు తనయుడు తాజాగా మాట్లాడుతూ భారత రత్న అంశం పై ప్రస్తావించారు.