ప్రధానికి సీఎం జగన్ లేఖ…పింగళి వెంకయ్య భారత రత్న ఇవ్వాలి

Friday, March 12th, 2021, 03:03:48 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీ కి లేఖ రాశారు. జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య కి భారత రత్న ఇవ్వాలి అంటూ లేఖ లో పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్ ప్రధాని కి లేఖ రాశారు. జాతీయ జెండా ను రూపొందించిన పింగళి వెంకయ్య కి అత్యున్నత గౌరవం ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే భారత్ కి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా అజాడీకా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్న వేళ పింగళి కి భారత రత్న ఇవ్వడం సముచితం గా ఉంటుంది అని జగన్ పేర్కొన్నారు. పింగళి కి భారత రత్న ఇచ్చే విధంగా కృషి చేయాలని లేఖ లో పేర్కొన్నారు. తాజాగా పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి అడిగిన సంగతి తెలిసిందే.