కేంద్ర జలశక్తి మంత్రి కి సీఎం జగన్ లేఖ… ఎందుకంటే!?

Wednesday, August 12th, 2020, 03:00:08 AM IST


తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తోంది. అయితే ఇప్పటికే ఒకరి పై మరొకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర జలషక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కి లేఖ రాశారు. కృష్ణా నది జలాల ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం అని, రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా పాతవాటికి కొనసాగింపు అని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరూస్తున్నట్లుగా అదనపు నీటిని మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదు అని లేఖ లో సీఎం జగన్ స్పష్టం చేశారు.

అయితే ఈ మేరకు పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి ప్రస్తావించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏపీ కి రావాల్సిన నీటిని వార సమర్థ వినియోగానికి అని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ లను చేపడుతోంది అని లేఖ లో పేర్కొ్నారు. పాలమూరు – రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు తెలంగాణ లో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయి అని సంచలన ఆరోపణలు చేశారు. పూర్తి స్థాయిలో ఆపెక్స్ నిబంధనలకు బద్దులై ఉంటామని చెప్పి తెలంగాణ మాట మార్చి ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను చేపట్టింది అని జగన్ మోహన్ రెడ్డి లేఖ లో తెలిపారు.