సీఎం జగన్ ఇంట విషాదం… వైఎస్ భారతి తండ్రి కన్నుమూత..!

Saturday, October 3rd, 2020, 08:30:31 AM IST

ఏపీ సీఎం జగన్ మామ, వైఎస్‌ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరాడు. ఇటీవలే సీఎం జగన్‌ హైదరాబాద్‌ వెళ్లి ఆస్పత్రిలో ఉన్న తన మామను పరామర్శించి వచ్చారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.

అయితే పులివెందులలో పేదలకు ఉచితంగా వైద్య సేవలందించి పేదల వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఈసీ గంగిరెడ్డి, 2001-2005 మధ్యకాలంలో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. అయితే నేడు మధ్యాహ్నం 12 గంటలకు స్వగ్రామం వేముల మండలం గొల్లల గూడూరులో గంగిరెడ్డి అంత్యక్రియలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే 11 గంటలకు సీఎం జగన్ కూడా పులివెందులకు వెళ్ళి అంత్యక్రియలలో పాల్గొననున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.