సోషల్ మీడియా లో సీఎం జగన్ హవా

Tuesday, November 24th, 2020, 03:52:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా లో దూసుకుపోతున్నారు. ఆగస్ట్ నెల నుండి అక్టోబర్ నెల వరకు సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్స్ అనే సంస్థ ఒక నివేదిక రూపొందించింది. అయితే ఈ నివేదిక లో సీఎం జగన్ మోహన్ రెడ్డి దేశం లోనే రెండవ స్థానం లో కొనసాగుతున్నారు. మొదటి స్థానం లో ప్రధాని నరేంద్ర మోడీ తన హవా కొనసాగిస్తున్నారు.

అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా మోడీ మొదటి స్థానం లో ఉన్నారు. ట్విట్టర్, గూగుల్ సెర్చ్, యూ ట్యూబ్ ప్లాట్ ఫామ్ లలో మోడీ పైనే అత్యధిక ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. అయితే దాదాపు 10 కోట్ల ఇంప్రెషన్ ల ఆధారంగా ఈ నివేదిక ఉండగా, అత్యధిక ట్రెండ్స్ ప్రధాని నరేంద్ర మోడీ పై ఉన్నాయి. 2,171 ట్రెండ్స్ తో మోడీ మొదటి స్థానం లో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోడీకి సమీపం లో 2,137 ట్రెండ్స్ తో రెండవ స్థానం లో నిలిచారు.ఆ తరువాతి స్థానాల్లో మమత బెనర్జీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లు ఉన్నారు.